Mirai: మిరాయ్ మూడు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు ఇవే...
బాక్సాఫీస్ కలెక్షన్లు ఇవే...
Mirai: యంగ్ హీరో తేజ సజ్జ నటించిన 'మిరాయ్' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. సినిమా కలెక్షన్లు రూ. 100 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. ఈ సినిమా తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 81.2 కోట్ల గ్రాస్ కలెక్షన్‌లు సాధించినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. సోమవారం నుంచి కలెక్షన్లలో స్వల్పంగా తగ్గే చాన్స్ ఉంది. పాజిటివ్ టాక్ రావడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ కలెక్షన్లలో అత్యధిక భాగం తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయి. అయితే, హిందీతో సహా ఇతర భాషల్లో కూడా సినిమా మంచి వసూళ్లను సాధిస్తోంది. సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్, మంచు మనోజ్ విలన్‌గా పోషించిన పాత్ర పాజిటివ్ గా మారింది. తేజ సజ్జా ఎనర్జిటిక్ ఫర్మామెన్స్ తో పాటు... డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని టెక్నికల్‌గా ఇచ్చిన విజువల్ ట్రీట్, యాక్షన్ సీక్వెన్స్‌లు అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి.
మూడు రోజుల్లో
మొదటి రోజు (సెప్టెంబర్ 12): సుమారు రూ. 27.20 కోట్ల గ్రాస్.
మొదటి రెండు రోజుల్లో (సెప్టెంబర్ 13): రూ. 55.60 కోట్ల గ్రాస్.
మొత్తం మూడు రోజుల్లో (సెప్టెంబర్ 14): రూ. 81.2 కోట్ల గ్రాస్.