Heroine Regina Cassandra: సౌత్ వాళ్లంటే చిన్నచూపు..కుండబద్ధలు కొట్టిన రెజీనా

కుండబద్ధలు కొట్టిన రెజీనా

Update: 2026-02-21 03:06 GMT

Heroine Regina Cassandra: దక్షిణాది చిత్రసీమలో అందం, నటనతోప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రెజీనా కసాండ్రా రెండు దశాబ్దాలుగా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. చెన్నైలో జన్మించిన ఈ అమ్మడు చిన్న వయసులోనే ఎంటరైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. తొమ్మిదేళ్ల వయసులో పిల్లల టీవీ కార్యక్రమానికి యాంకర్ కెమెరా ముందుకొచ్చింది. తమిళ చిత్రం 'కంద నాళ్ ముదల్'లో బాలనటిగా కనిపించి సినీ రంగంలో ప్రవేశించారు. తెలుగులో శివ మనసులో శృతితో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ఇంటర్వ్యూలో హిందీ చిత్రసీమలో ఎదురైన అవమానాలను షేర్ చేసుకున్నారు.

కొందరు మాటలతోనే కాకుండా వ్యవహారంలోనూ తనను తక్కువగా చూసిన సందర్భాలు ఉన్నాయని ఆమె అన్నారు. అలాంటి పరిస్థితుల్లో సరైన కథలను ఎంపిక చేసుకో వడం కష్టంగా మారిందని రెజీనా చెప్పింది. ఎక్కువగా ప్రాధాన్యత లేని పాత్రలే వచ్చేవని, అవి చేయడం సులభమే అయినప్పటికీ తాను ప్రధానంగా భిన్నమైన, కంటెంట్ ఉన్న పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చానని, మెయిన్హీమ్ కమర్షియల్ పాత్రల కంటే వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని తాను నిర్ణయించుకున్నానని తెలిపింది. అదే సమయంలో బాలీవుడ్లో అప్పట్లో ఎదురైన పరిస్థితులు ఎప్పటికి అలాగే ఉండవని అభిప్రాయపడింది.

నటి రెజీనా కసండ్రా ప్రస్తుతం తన కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ప్రయోగాత్మక చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Tags:    

Similar News