Sreeleela Mother Clarifies: తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ తల్లి

డేటింగ్ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ తల్లి

Update: 2026-05-18 07:03 GMT

Sreeleela Mother Clarifies: టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ ప్రేమలో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. నెటిజన్లు, కొన్ని వెబ్‌సైట్లు వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై రకరకాల కథనాలను అల్లేశారు. అయితే ఈ వైరల్ రూమర్లకు శ్రీలీల తల్లి స్వర్ణలత తాజాగా గట్టి బ్రేక్ వేశారు. ఈ వార్తల్లో అణువంత కూడా నిజం లేదని ఆమె ఖరాఖండిగా తేల్చిచెప్పారు.

చదువు, కెరీర్ మాత్రమే ముఖ్యం..

ఈ అంశంపై స్వర్ణలత పూర్తి స్పష్టతనిస్తూ.. "ప్రస్తుతం శ్రీలీల తన సినీ కెరీర్‌తో పాటు చదువుపైనా పూర్తి దృష్టి పెట్టింది. సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సమయం దొరికినప్పుడల్లా తన వైద్య విద్యపై ఏకాగ్రత చూపుతోంది. ముఖ్యంగా ఆమె ఇప్పుడు నీట్-పీజీ పరీక్ష కోసం రాత్రింబవళ్లు సన్నద్ధమవుతోంది. ఆమె వ్యక్తిగత జీవితం లేదా పెళ్లి గురించి ఆలోచించే దశకు ఇంకా చాలా సమయం ఉంది. బహుశా మరో ఐదు నుంచి ఆరు సంవత్సరాల తర్వాతే ఆ విషయాలపై దృష్టి పెడుతుంది" అని స్పష్టం చేశారు.

తిరుమల, వాంఖడే స్టేడియం.. అంతా యాదృచ్ఛికమే..

సోషల్ మీడియాలో ఈ పుకార్లు పుట్టడానికి గల కారణాలను కూడా ఆమె ప్రస్తావించారు. 2025 డిసెంబర్‌లో తిరుమల శ్రీవారి దర్శన సమయంలో శ్రీలీల, తిలక్ వర్మ పక్కపక్కన కనిపించడం.. అలాగే ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌కు శ్రీలీల హాజరుకావడం వంటివి కేవలం యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలేనని తెలిపారు. కేవలం వీటిని బేస్ చేసుకుని లేనిపోని ఊహాగానాలు సృష్టించి, ఒక బంధాన్ని అంటగట్టడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.

గతంలో బాలీవుడ్ హీరోతో కూడా..

"గతంలో బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్‌తో కూడా శ్రీలీల రిలేషన్‌లో ఉందంటూ ఇలాంటి కథనాలే రాశారు. నిజానికి కార్తిక్ ఆర్యన్ తల్లి, నేను ఇద్దరం గైనకాలజిస్టులం. మా మధ్య ఉన్న వృత్తిపరమైన పరిచయాన్ని తప్పుగా అర్థం చేసుకుని అప్పట్లో పుకార్లు పుట్టించారు" అని స్వర్ణలత గుర్తుచేశారు.

అభిమానులకు సూచన:

సినీ తారల వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు ప్రచారం చేయడం తగదని ఆమె హితవు పలికారు. సెలబ్రిటీల గురించిన ఇలాంటి రూమర్లను అభిమానులు, ప్రేక్షకులు అస్సలు నమ్మవద్దని శ్రీలీల తల్లి స్వర్ణలత కోరారు. ఈ క్లారిటీతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న శ్రీలీల-తిలక్ వర్మ లవ్ స్టోరీ రూమర్లకు ఎండ్ కార్డ్ పడినట్లయింది.

Tags:    

Similar News