Samantha’s Ma Inti Bangaram Teaser: హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా.. సమంత మా ఇంటి బంగారం టీజర్

సమంత మా ఇంటి బంగారం టీజర్

Update: 2026-01-10 04:57 GMT

Samantha’s Ma Inti Bangaram Teaser: సమంత లీడ్ రోల్‌‌లో నటిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సమంతకు చెందిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టీజర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోందని టీజర్ ద్వారా అర్ధమవుతోంది. ఇందులో సమంత ట్రెడిషినల్‌‌గా కనిపిస్తూనే పవర్‌‌‌‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌‌లతో మెప్పించి అంద‌‌రి దృష్టిని ఆక‌‌ర్షిస్తోంది. సాధార‌‌ణ‌‌మైన ఇల్లాలిగా అత్తగారింటికి వెళ్లిన సమంతకు అక్కడ ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, వాటిని ఆమె ఎలా ఎదుర్కొంది అనేది ఆసక్తిరేపేలా ఉంది టీజర్. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుషా కీలకపాత్రల్లో కనిపించారు. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం హైలైట్‌‌గా నిలిచింది. ఈ సినిమాకు కథనం, స్క్రీన్‌‌ప్లే, డైలాగ్స్‌‌ను వసంత్ మారిన్‌‌గంటి, రాజ్ నిడిమోరు అందిస్తుండగా, రైటర్ సీతా ఆర్ మీనన్ క్రియేటివ్ సూపర్‌‌విజన్ చేస్తున్నారు. ఓ బేబి’ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్‌‌లో వస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News