హిల్టన్‌, దీపికా పదుకొనే 'ఇట్ మ్యాటర్స్ వేర్ యూ స్టే' క్యాంపెయిన్

Hilton, Deepika Padukone 'It Matters Where You Stay' Campaign;

Update: 2025-06-10 11:33 GMT

మల్టిపుల్‌ టాలెంటెడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణే స్వీయ కృషితో విజయ తీరాలకు దూసుకెళ్తోంది. వివిధ పాత్రలను సమర్థంగా నిర్వర్తిస్తూ, తనకంటూ ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పరుచుకుంది. ఇప్పుడు ఆమె ఆధునిక భారత యువతకు ప్రేరణగా నిలుస్తూ, ధైర్యంగా, నిబద్ధతతో ముందుకు సాగుతున్నారు. అలాంటి దీపికాను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకున్న హిల్టన్‌ సంస్థ.. తన తాజా అడ్వర్‌టైజ్‌మెంట్‌ సిరీస్‌లో 'ఇట్ మ్యాటర్స్ వేర్ యూ స్టే' అనే క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. దీపికా హోమ్‌సిటీ అయిన బెంగళూరులో షూట్ చేసిన ఈ పబ్లిసిటీ వీడియో, ఆమె విజయానికి మద్దతుగా నిలిచే మానవీయ సందర్భాలను, భారతీయ అతిథి సంస్కృతికి హిల్టన్‌ ఎలా తోడ్పడుతున్నదో చూపిస్తుంది.



ప్రతిఒక్క ప్రయాణికుడి అవసరాలను ముందుగానే గుర్తించి సేవ చేయాలనే హిల్టన్‌ నమ్మకం ఆధారంగా రూపొందించిన ఈ పబ్లిసిటీ.. చిన్న విషయాలే గొప్ప అనుభవాల్ని కలిగిస్తాయన్న భావన చుట్టూ తిరుగుతుంది.


పని, విశ్రాంతి మధ్య సమతుల్యత, లేదా ప్రయాణ సమయంలో ఒక్క కాఫీ మూలమై దొరికే నిమిషం శాంతి – ఇవి అన్నీ గ్రాండ్‌ లగ్జరీ కంటే విలువైనవిగా చూపిస్తుంది ఈ ప్రచారం.




హిల్టన్‌ అనుభవం అనేది ఓ ప్రత్యేకమైనదని, ‘ది స్టే’ అనే మా సిద్ధాంతం ప్రయాణికులకు విశ్రాంతిని, శక్తిని, తమ జర్నీకి అవసరమైన ప్రేరణను ఇస్తుందని హిల్టన్‌ గ్లోబల్ మార్కెటింగ్ అధికారి మార్క్ వెయిన్‌స్టీన్‌ చెప్పారు. ఈ ప్రచారాన్ని తాము కొత్త తరహా భారతీయ ప్రయాణికుల ఆత్మతో రూపొందించామని, దీపికా తన కథను ఎంతో స్వచ్ఛంగా, మనసుని తాకేలా చెప్పగలిగారని, ఆమె ప్రయాణం మా అతిథుల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. హిల్టన్‌ ప్రయాణం ఒక జ్ఞాపకం కావడానికి చిన్నచిన్న విషయాలే కారణమవుతాయని, ఆత్మీయ స్వాగతం, వ్యక్తిగత శ్రద్ధ, చిన్నచిన్న సౌకర్యాలు… ఇవే తనను మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్లేలా చేస్తాయని దీపికా పదుకొనే అన్నారు.





Tags:    

Similar News