Homebound: ఆస్కార్‌కు భారత్ తరఫున హోమ్‌బౌండ్ అధికారిక ఎంట్రీ..

హోమ్‌బౌండ్ అధికారిక ఎంట్రీ..

Update: 2025-09-20 06:42 GMT

Homebound: ఈశాన్‌ కట్టర్‌, విశాల్‌ జెత్వా, జాన్వీ కపూర్‌ కలిసి నటించిన సినిమా హోమ్‌బౌండ్‌ ఆస్కార్స్‌ 2026కు భారతదేశం తరపున అధికారికంగా ఎంపికైంది. ది బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ విభాగంలో ఈ సినిమా ఆస్కార్స్‌ బరిలో నిలవనుంది. సెలక్షన్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ ఎన్‌. చంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్ నుంచి మొత్తం 24 సినిమాలు ఈ పోటీలో ఉన్నాయని, వాటిలో హోమ్‌బౌండ్‌ అత్యుత్తమ చిత్రంగా ఎంపికైందని ఆయన పేర్కొన్నారు.

సినిమా కథాంశం

పోలీసు కావాలనే కలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు స్నేహితులు కుల, మత వివక్షలకు వ్యతిరేకంగా చేసిన పోరాటమే ఈ సినిమా కథాంశం. నీరజ్‌ ఘైవాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ప్రేక్షకులను ఎంతగానో కదిలించింది. ఈ సినిమా ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై మంచి ప్రశంసలు అందుకుంది. హోమ్‌బౌండ్‌ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రంగా నిలిచింది. ఇక్కడ ప్రదర్శన తర్వాత అతిథులు నిలబడి చప్పట్లు కొట్టడం సినిమా ఎంతగా ఆకట్టుకుందో రుజువు చేస్తుంది. టొరంటో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ఇంటర్నేషనల్‌ పీపుల్స్‌ ఛాయిస్‌ అవార్డులో రెండో రన్నరప్‌గా నిలిచింది. అంతర్జాతీయంగా మంచి పేరు పొందిన హోమ్‌బౌండ్‌ ఈ నెల 26న థియేటర్లలో విడుదల కానుంది.

Tags:    

Similar News