Manashankar Vara Prasad’s Project: మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ ఎలాం ఉందంటే.?

ట్రైలర్ ఎలాం ఉందంటే.?

Update: 2026-01-05 05:23 GMT

Manashankar Vara Prasad’s Project: మెగాస్టార్ చిరంజీవి , అనిల్ రావిపూడి గారి కాంబినేషన్‌లో వస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి సంబంధించిన అధికారిక ట్రైలర్ విడుదలైంది.ఈ సినిమాలో చిరంజీవి శంకర వరప్రసాద్ అనే మాజీ RAW ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పాత్రలో కనిపిస్తున్నారు. ట్రైలర్ ప్రారంభంలో అయన చాలా సీరియస్ ఆఫీసర్‌గా కనిపిస్తూనే, ఆ తర్వాత ఇంటి పనుల్లో మునిగిపోయిన ఒక సాధారణ వ్యక్తిగా తన మార్క్ కామెడీతో ఆకట్టుకున్నారు. ఇందులో నయనతార 'శశిరేఖ' అనే డైనమిక్ పాత్రలో నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సరదా సన్నివేశాలు, భార్య దగ్గర చిరంజీవి వినయంగా ఉండటం వంటివి ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి. ట్రైలర్ చివరలో విక్టరీ వెంకటేష్ గారు మాస్ ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరి మధ్య జరిగే 'మాస్ vs ఫ్యామిలీ' సినిమాల డైలాగులు ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచాయి.

అనిల్ రావిపూడి తనదైన శైలిలో కామెడీ ,యాక్షన్‌ను జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లో జోష్ నింపింది.జనవరి 12, 2026న ప్రపంచవ్యాప్తంగా ‘మన శంకర వరప్రసాద్’ థియేటర్లలోకి రానుంది. షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News