‘Satyavati’ First Look Unveiled: 'గోపీచంద్ 33'లో యోధవరాలిగా రీతూ వర్మ: 'సత్యవతి' ఫస్ట్ లుక్ విడుదల

'సత్యవతి' ఫస్ట్ లుక్ విడుదల

Update: 2026-03-10 12:00 GMT

‘Satyavati’ First Look Unveiled: మ్యాచో స్టార్ గోపీచంద్,'ఘాజీ' ఫేమ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామా నుండి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న రీతూ వర్మ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమె 'సత్యవతి' అనే పవర్‌ఫుల్ రాజవంశపు యోధవరాలి పాత్రలో కనిపిించనున్నారు.

విడుదలైన పోస్టర్‌లో రీతూ వర్మ యోధ దుస్తులు ధరించి, శత్రువుపై గురిపెట్టి బాణం వేస్తున్న భంగిమలో చాలా గంభీరంగా కనిపిస్తున్నారు. ఆమె పాత్ర సినిమాలో చాలా శక్తివంతంగా ఉండబోతోందని ఈ లుక్ చూస్తుంటే అర్థమవుతోంది. గతేడాది 'మజాకా' సినిమాలో అలరించిన రీతూ వర్మ, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆమె కెరీర్‌లో ఇది ఒక విభిన్నమైన మరియు సవాలుతో కూడిన పాత్ర కానుంది.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారత చరిత్రలో ఇప్పటివరకు పెద్దగా ఎవరికీ తెలియని ఒక అద్భుతమైన ఘట్టాన్ని డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ఈ సినిమా ద్వారా వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఇందులో గోపీచంద్ కూడా మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్‌ఫుల్ యోధుడి అవతారంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

చారిత్రక నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. టెక్నికల్ పరంగా కూడా ఎంతో ఉన్నతంగా ఉండబోతున్న ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Tags:    

Similar News