‘Peddi’ Runtime: పెద్ది రన్‌టైమ్‌పై వస్తున్న వార్తల్లో నిజమెంత? క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
‘Peddi’ Runtime: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'వఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పెద్ది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వస్తున్న రన్‌టైమ్ పుకార్లపై చిత్ర యూనిట్ తాజాగా స్పందించింది. ఏప్రిల్ 30న సినిమాను అత్యంత గ్రాండ్‌గా విడుదల చేసేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయని, అనవసరపు వదంతులను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది.
రన్‌టైమ్‌పై పబ్లిసిస్ట్ క్లారిటీ:
సినిమా రన్‌టైమ్ గురించి వస్తున్న వార్తలపై పబ్లిసిస్ట్ వంశీ శేఖర్ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. సినిమా మొదటి భాగం ఎడిటింగ్ ఇప్పటికే పూర్తయి లాక్ అయిందని తెలిపారు. ప్రస్తుతం సెకండాఫ్ షూటింగ్ చివరి దశలో ఉందని, ఎడిటింగ్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని ఆయన స్పష్టం చేశారు.
దూసుకెళ్తున్న రై రై రా రా సాంగ్:
మరోవైపు ఈ సినిమా నుండి విడుదలైన రామ్ చరణ్ ఇంట్రో సాంగ్ రై రై రా రా యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ మాస్ డ్యాన్స్ నంబర్‌ను ఏఆర్ రెహమాన్ స్వయంగా పాడటం విశేషం. రామ్ చరణ్ తనదైన మాస్ ఎనర్జీ, గ్రేస్‌ఫుల్ స్టెప్పులతో ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్ ఇచ్చారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, అనంత శ్రీరామ్ సాహిత్యం ఈ పాటకు మరింత ఊపునిచ్చాయి.