కూలి సినిమాకు భారీ బిడ్డింగ్

Huge bidding in Telugu states for Coolie movie rights;

Update: 2025-06-10 11:02 GMT

కూలి సినిమా హక్కుల కోసం తెలుగు రాష్ట్రాల్లో భారీ బిడ్డింగ్ జరిగింది. ఏకంగా 43 కోట్ల రూపాయలతో ఈ సినిమా రైట్స్ కోసం పోటీ నడిచినట్లు టాక్. ఈ రేసులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ ముందున్నాయని సమాచారం. ఈ ఇద్దరిలో ఎవరికి ఈ బిగ్ డీల్ దక్కుతుందో చూడాలి. రజనీకాంత్ స్టార్‌డమ్, లోకేష్ కనగరాజ్ మార్క్ డైరెక్షన్‌తో కూలి హైప్ పీక్స్‌లో ఉంది. పంపిణీదారులు హక్కుల కోసం పోటీ పడుతున్నారు. హక్కుల కోట్ చేసిన ధర ₹40 కోట్ల నుండి ₹50 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

ఈ సినిమాలో మాస్ హీరో రజనీకాంత్ నటనకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం సూపర్ హిట్ ఇస్తుందని చిత్రపరిశ్రమలో టాక్ మొదలైంది. టాలీవుడ్ హీరో నాగార్జున ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించారు.

Tags:    

Similar News