Husharu Pittalu: యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘హుషారు పిట్టలు’ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. అన్షు, వాసవి గణేశన్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి బిక్షు దర్శకత్వం వహించారు. ఇప్పటికే టీజర్‌, పాటలతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుకున్న ఈ సినిమా ట్రైలర్‌తో మరింత అంచనాలు పెంచుతోంది.

ట్రైలర్‌ను పరిశీలిస్తే యువత జీవితంలో ఎదురయ్యే సరదాలు, ప్రేమ, స్నేహం, భావోద్వేగాలతో పాటు కొన్ని సీరియస్‌ అంశాలను కూడా సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌ను యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నడిపించి, సెకండాఫ్‌లో మెచ్యూర్డ్‌ కంటెంట్‌తో కథను మరో మలుపు తిప్పినట్లు చిత్ర బృందం గతంలో వెల్లడించింది. దర్శకుడు బిక్షు తన చుట్టూ జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించినట్లు తెలిపారు.

రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మించిన ఈ సినిమాను ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు విడుదల చేస్తున్నాయి. చరణ్‌ అర్జున్‌ సంగీతం అందించారు. ఇప్పటికే ‘టోంగా.. టోంగా’ పాటకు మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.

ఇక ‘హుషారు పిట్టలు’ చిత్రాన్ని ఆగస్టు 15న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. టీజర్‌ తర్వాత వచ్చిన ట్రైలర్‌ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచడంతో థియేటర్లలో ఈ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.

Tags: