Ritika Nayak: రితికా నాయక్ పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్ అనే ట్యాగ్‌తో వినిపిస్తోంది. వరుసగా ఆమె నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో కనిపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది రితికా నాయక్.

‘అశోకవనంలో అర్జున కళ్యాణం’, ‘హాయ్ నాన్న’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రితికా.. ఆ తర్వాత ‘మిరాయ్’తోనూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తాజాగా వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’లోనూ హీరోయిన్‌గా మెప్పిస్తోంది. ఇలా వరుసగా మంచి ప్రాజెక్టుల్లో భాగం కావడంతో రితికాను టాలీవుడ్‌లో లక్కీ చార్మ్‌గా భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ఉన్న యువ హీరోయిన్లలో రితికా నాయక్‌కి భిన్నమైన ఇమేజ్ ఏర్పడుతోంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో రాబోయే రోజుల్లోనూ ఆమెకు మరిన్ని ఆసక్తికరమైన అవకాశాలు దక్కే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుస సినిమాల ఫలితాలతో రితికా నాయక్ తన ‘లక్కీ హీరోయిన్’ ఇమేజ్‌ను ఎంతవరకు నిలబెట్టుకుంటుందో చూడాలి.

Tags: