‘I Am Game’: తెలుగు రాష్ట్రాల్లో ‘ఐయామ్ గేమ్’ మార్నింగ్ షోలు రద్దు
రద్దు
‘I Am Game’: దుల్కర్ సల్మాన్ నటించిన డబ్బింగ్ చిత్రం ‘ఐయామ్ గేమ్’కు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో బజ్ కనిపించడం లేదు. సినిమాకు సంబంధించిన ట్రైలర్, పాటలు తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీనికి తోడు సినిమా విడుదల ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడటంతో అంచనాలు మరింత తగ్గాయి.
తాజాగా సినిమాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు వెర్షన్‌కు సంబంధించిన మార్నింగ్ షోలు నేడు రద్దయ్యాయి. మలయాళ వెర్షన్ మాత్రం ఉదయం థియేటర్లలో విడుదల కాగా, తెలుగు వెర్షన్ మార్నింగ్ షోలకు స్క్రీనింగ్ కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లో దుల్కర్ సల్మాన్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ‘మహానటి’, ‘సీతా రామం’, ‘కల్కి 2898 ఏడీ’, ‘లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అయితే ఈ క్రేజ్ ‘ఐయామ్ గేమ్’పై మాత్రం తగినంత ఆసక్తిని తీసుకురాలేకపోయింది.
ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్లలో సినిమాకు నైట్ షోలు ప్రస్తుతం బుకింగ్ యాప్స్‌లో కనిపిస్తున్నాయి. దీంతో తెలుగు వెర్షన్ రాత్రి షోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన కయాదు లోహర్ నటించారు.