Mrunal Thakur’s Candid Remark: నేను అందంగా లేను: మృణాల్ ఠాకూర్
మృణాల్ ఠాకూర్
Mrunal Thakur’s Candid Remark: రొమాంటిక్ కామెడీ దో దివానే షహర్ మే ప్రమోషన్ సందర్భంగా నటి మృణాల్ ఠాకూర్ తన మనసులోని భావాలను పంచుకుంది. సినిమాలో తన పాత్ర “నేను అందంగా లేను" అని చెప్పే డైలాగ్ తన జీవితానికి చాలా దగ్గరగా అనిపించిందని తెలిపారు. చిన్ననాటి నుంచి పోలికలు, తక్కువచూపు కారణంగా చాలామంది అమ్మాయిలే కాదు అబ్బాయిలూ ఆత్మవిశ్వాసం కోల్పోతారని, అదే అనుభూతి తనకూ ఉందని చెప్పారు. ఈ కారణంగానే సినిమాకు వెంటనే అంగీకరించానని వెల్లడిం చింది. డైలాగు అభిమానులు 'జోక్'గా చూస్తున్నారన్న వ్యాఖ్యలకు స్పందిస్తూ, "వాళ్లు నన్ను ఎలా చూస్తారో అది వేరు, నేను నన్ను ఎలా చూస్తానో అది వేరు" అంటూ నవ్వారు.
2025 వరకూ తన రూపంపై పూర్తి నమ్మకం. లేదని, అప్పటి బ్యూటీ ప్రమాణాలకు తాను సరిపోనన్న భావన వెంటాడిందని చెప్పింది. కాలంతో పాటు అందం నిర్వచనం మారిందని స్వఖ్యానించారు. తాను నటుడు ధనుష్ తో 'డేటింగ్ లో ఉన్నానని, పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తలు ఆమె ఖండించింది. తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా తన పేరుతో మాటలు అంటగట్టారని, అది " భయంగా అనిపించిందన్నారు. ఇద్దరూ కలిసి కనిపించడంతో డేటింగ్ రూమర్లు వినిపిస్తున్నా, ఈ విషయంలో అధికారిక ప్రకటన ఏదీ లేదని స్పష్టం చేశారు.