Vijay Devarakonda : నేను బెట్టింగ్‌ యాప్‌లకు ప్రమోషన్‌ చెయ్యలేదు

ఈడీ విచారణ అనంతరం మీడియాకు వెల్లడించిన విజయ్‌ దేవరకొండ;

Update: 2025-08-06 12:23 GMT

తాను ఎటువంటి బెట్టింగ్‌ యాప్స్‌కి ప్రమోషన్లు చెయ్యలేదని, తాన ప్రమోషన్‌ చేసిన ఒకే ఒక్క యాప్‌ గేమింగ్‌ యాప్‌ అని టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ స్పష్టం చేశారు. బుధవారం ఈడీ హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు హాజరైన విజయ్‌ దేవరకొండ విచారణ ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడారు. మీడియా నన్ను బెట్టింగ్‌ యాప్‌లకు ప్రమోషన్‌ చేసినట్లు చెపుతోందని కానీ నేను ఎలాంటి బెట్టింగ్‌ యాప్‌ల కు ప్రమోషన్‌ చేయలేదని ఆ విషయాన్ని మీడియా గుర్తించి తమ వార్తలను సరి చేసుకోవాలని కోరారు. తాను ప్రమోట్‌ చేసిన గేమింగ్‌ యాప్‌ చట్టపరమైన యాప్‌ అని ఈ గేమింగ్‌ యాప్‌ ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌కి, ఇండియన్‌ ఉమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌కి, ఇండియన్‌ ఒలంపిక్‌ టీమ్‌కి, ఐపీఎల్‌, కబడ్డీ లీగ్‌ల వంటి వాటికి స్పాన్సర్‌ చేస్తాయని విజయ్‌ వివరించారు. బెట్టింగ్‌ యాప్స్‌కి గేమింగ్‌ యాప్స్‌కి అస్సులు సంబంధం లేదన్నారు. ఈ వ్యవహారంలో నా పేరు ఎలా వచ్చిందో ఈడీ అధికారులకు కూడా అర్ధం కాలేదని విజయ్‌ దేవరకొండ అన్నారు. నా బ్యాంక్‌ లావాదేవీలు అన్నీ ఈడీకి ఇచ్చానని విజయ్‌ దేవరకొండ తెలిపారు.

Tags:    

Similar News