Actress Mrunal Thakur: డేటింగ్ చేయడానికి నాకు అస్సలు టైం లేదు: మృణాల్ ఠాకూర్
నాకు అస్సలు టైం లేదు
Actress Mrunal Thakur: సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘సీత’గా చెరగని ముద్ర వేసుకున్నారు మృణాల్ ఠాకూర్. వరుస సినిమాలతో టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో తన పెళ్లి లేదా రిలేషన్‌షిప్‌పై వచ్చే వార్తలకు ఎప్పుడూ ఏదో ఒక సెటైరికల్ ఆన్సర్ ఇస్తూనే ఉంటారు. అయితే తాజాగా తన పర్సనల్ లైఫ్‌పై మృణాల్ ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్.. తన కెరీర్ పట్ల తనకు ఉన్న డెడికేషన్ గురించి వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుతం నా దగ్గర ప్రేమించడానికి లేదా రిలేషన్‌షిప్‌లో ఉండటానికి అస్సలు టైమ్ లేదు" అని ఆమె కుండబద్దలు కొట్టారు. దానికి ఆమె చెప్పిన కారణం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. "ఈ మధ్యే నా కాలుకు చిన్న దెబ్బ తగిలింది. కనీసం ఆ దెబ్బకు ట్రీట్‌మెంట్ చేయించుకోవడానికి కూడా నాకు తీరిక లేదు.. అంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నాను" అంటూ తన బిజీ లైఫ్ గురించి చెప్పుకొచ్చారు.
సాధారణంగా హీరోయిన్లకు సంబంధించి వారు ఎవరితో డేటింగ్ చేస్తున్నారు? ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? అనే విషయాల పైనే అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ మృణాల్ ఆలోచనలు చాలా భిన్నంగా ఉన్నాయి. "నేను ఎవరితో డేటింగ్ చేస్తున్నాను? ఎవరితో తిరుగుతున్నాను? అన్న విషయాల కంటే.. నేను చేసే సినిమాలు, నా నటన ద్వారానే నాకు గుర్తింపు రావాలి" అని ఆమె స్పష్టం చేశారు.
ప్రస్తుతం మృణాల్ చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. హిందీలో ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సౌత్‌లో కూడా క్రేజీ ఆఫర్లు అందుకుంటోంది. షూటింగ్‌లు, ప్రమోషన్లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు.. ఇలా క్షణం తీరిక లేకుండా గడుపుతోంది.