Mass Jathara Teaser Released: నాకంటూ ఒక హిస్టరీ ఉంది..మాస్ జాతర టీజర్ రిలీజ్

మాస్ జాతర టీజర్ రిలీజ్;

Update: 2025-08-12 06:33 GMT

Mass Jathara Teaser Released: రవితేజ 75వ చిత్రం మాస్ జాతర టీజర్ విడుదలైంది. రవితేజ అభిమానులు ఆశించే అన్ని మాస్ అంశాలతో ఈ టీజర్ ఉంది.. ఇందులో యాక్షన్, కామెడీ, రవితేజ ఎనర్జీ అన్నీ పుష్కలంగా ఉన్నాయి.

రవితేజ ఈ సినిమాలో ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. ఆయన తన డిపార్ట్ మెంట్ తప్ప అన్ని డిపార్ట్ మెంట్లల వేలు పెడుతూ ఉంటాడు అనే డైలాగ్ తో రవితేజ్ క్యారెక్టర్ ను పరిచయం చేశారు.నాకంటూ ఓ హిస్టరీ ఉంది అనే డైలాగులు బాగున్నాయి.వింటేజ్ రవితేజను గుర్తుచేసేలా ఆయన నటన, కామెడీ టైమింగ్, యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. ధమాకా తర్వాత మళ్ళీ శ్రీలీల రవితేజతో కలిసి నటించడం ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. శ్రీలీల ఈ టీజర్‌లో బ్యూటీఫుల్ లుక్ తో మెస్మరైజ్ చేసింది

టీజర్ చివర్లో రవితేజ, రాజేంద్ర ప్రసాద్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశం బాగా ఆకట్టుకుంది. భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌ను మరింత హైప్ పెంచింది. ఈ సినిమాతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ టీజర్ సినిమాపై మరింత హైప్ ను పెంచింది.

Tags:    

Similar News