Vincy Sony: ఆయనలో మార్పు కనబడుతోంది.. తప్పు తెలుసుకున్నారు : విన్సీ సోనీ
తప్పు తెలుసుకున్నారు : విన్సీ సోనీ;
Vincy Sony: మలయాళ చిత్రసీమలో పనిచేసే మహిళలు వేధింపులకు గురవుతున్నారని జస్టిస్ హేమ కమిటీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఏడాది కావస్తోంది. ఆ నివేదిక తర్వాత చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న ఇబ్బందులపై స్పందించారు. గత ఏప్రిల్లో నటి విన్సీ సోనీ అలోషియస్ కూడా ఇదే తరహా సమస్యను తెరపైకి తెచ్చింది. సూత్రవాక్యం మలయాళ మూవీ షూటింగ్ సమయంలో నటుడు షైన్ టామ్ చాకో తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడంటూ ఆరోపించడమే కాకుండా.. మలయాళ ఫిల్మ్ చాంబర్లోనూ ఫిర్యాదు చేసింది. కానీ ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఇద్దరూ ఆ వివాదానికి ముగింపు పలికారు. కావాలని చేసింది కాదని, సరదాగా చెప్పానంటూ.. జరిగిన దానికి తాను క్షమాపణలు చెబుతున్నానని నటుడు అనడంతో స్పందించిన ఆమె.. ఆయనలో మార్పు కనబడుతోందని, తన తప్పు తెలుసుకున్నాడని, దీంతో ఆయనపై గౌరవం పెరిగిందని చెప్పింది. వీరిద్దరు కలిసి నటించిన ఈ మూవీ ఈ నెల 11న థియేటర్లలో విడుదల కానుంది. కుటుంబ కథాంశంతో కూడిన హాస్య నాటకంగా దీన్ని తెరకెక్కించారు.