Rebel Star Prabhas Shines: జపాన్‌ను షేక్ చేస్తున్న ప్రభాస్ క్రేజ్.. ప్రతిష్టాత్మక అనన్ మ్యాగజైన్‌పై సోలోగా మెరిసిన రెబల్ స్టార్..

ప్రతిష్టాత్మక అనన్ మ్యాగజైన్‌పై సోలోగా మెరిసిన రెబల్ స్టార్..

Update: 2026-02-07 11:15 GMT

Rebel Star Prabhas Shines: పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ ఇప్పుడు ఖండాలు దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. తాజాగా జపాన్‌కు చెందిన అత్యంత పాపులర్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ అనన్ బ్యాక్ కవర్‌పై ప్రభాస్ సోలో ఫోటోతో మెరిసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఒక భారతీయ నటుడికి జపాన్ మ్యాగజైన్ ఇంతటి గౌరవం ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

రాయల్ లుక్

ఫిబ్రవరి 10న విడుదల కానున్న 2483వ సంచికలో ప్రభాస్ ఫోటో ప్రచురితమైంది. ఈ ఫీచర్‌ను సదరు మ్యాగజైన్ రాయల్ ఆడియన్స్ గ్రావుర్ అని అభివర్ణించడం విశేషం. 2025 డిసెంబర్‌లో ప్రభాస్ టోక్యోలో పర్యటించిన సమయంలోనే ఈ ప్రత్యేక ఫోటోషూట్ నిర్వహించారు. జపాన్ అభిమానులతో ఆయనకున్న బలమైన అనుబంధాన్ని ఈ మ్యాగజైన్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. బాహుబలితో మొదలైన ప్రభాస్ మేనియా.. సలార్

, కల్కి 2898 AD చిత్రాలతో జపాన్‌లో శిఖర స్థాయికి చేరింది. ముఖ్యంగా అక్కడ కల్కి చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ చూసి జపాన్ మీడియా ప్రభాస్ ఇమేజ్‌కు ఫిదా అయిపోయింది. సాధారణంగా జపాన్ మ్యాగజైన్‌ల కవర్ పేజీలపై స్థానిక నటులకే ప్రాధాన్యత ఉంటుంది. కానీ సోలోగా ప్రభాస్ ఫోటో దర్శనమివ్వడం ఆయన గ్లోబల్ ఇమేజ్‌కు నిదర్శనమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఖుషీలో డార్లింగ్ ఫ్యాన్స్:

విదేశీ గడ్డపై తన ఫేవరెట్ హీరో సత్తా చాటుతుండటంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ కేవలం సౌత్ లేదా ఇండియా స్టార్ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ స్టార్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags:    

Similar News