Bandi Sanjay’s Review on Akhanda 2: ఇన్ని రోజులు నా జీవితం వృధా చేశా.. అఖండ 2పై బండి సంజయ్ రివ్యూ

అఖండ 2పై బండి సంజయ్ రివ్యూ

Update: 2025-12-29 13:28 GMT

Bandi Sanjay’s Review on Akhanda 2: నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ 2: తాండవం' సినిమాను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్‌లో దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి చూశారు.సినిమా చూసిన అనంతరం బండి సంజయ్ మీడియాలో, సోషల్ మీడియా (X) వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"అఖండ 2 కేవలం సినిమా కాదు, అదొక ప్రకటన. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, అది శతాబ్దాల ఒత్తిడిని తట్టుకుని ఎలా నిలబడిందో ఈ చిత్రం అద్భుతంగా చూపించింది" అని ఆయన పేర్కొన్నారు.

నందమూరి బాలకృష్ణ నటనపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. తెరపై ఆయన పవర్, ఆధ్యాత్మిక భావం చూస్తుంటే శివుడే స్వయంగా వచ్చినట్లు ఉందని, ఆయన నటన సీనియర్ ఎన్టీఆర్‌ను గుర్తుకు తెచ్చిందని అన్నారు. "ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా ఇది. ధర్మం దారి తప్పిన వాళ్లకు ఈ సినిమా ఒక గుణపాఠం" అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తున్నందుకు దర్శకుడు బోయపాటి శ్రీనును అభినందించారు. సనాతన ధర్మం గురించి ఇలాంటి సినిమాలు తీయడానికి ఎంతో ధైర్యం కావాలని కొనియాడారు. ఈ సినిమా చూశాక "ఇన్ని రోజులు నా జీవితాన్ని వృధా చేశానని అనిపించింది.. మిగిలిన జీవితాన్ని దేశం, ధర్మం కోసం అంకితం చేయాలనే ఆలోచన కలిగిస్తోంది" అని బండి సంజయ్ భావోద్వేగంగా మాట్లాడారు.

అఖండ 2 డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. బాలకృష్ణతో పాటు సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్.ఎస్. థమన్ అందించిన నేపథ్య సంగీతం (BGM) పై కూడా బండి సంజయ్ ప్రశంసలు కురిపించారు.

Tags:    

Similar News