గూగుల్ సెర్చ్‌లో ఐకాన్ స్టార్ హవా.. 2025 టాలీవుడ్ టాప్-5 హీరోలు వీరే

2025 టాలీవుడ్ టాప్-5 హీరోలు వీరే

Update: 2025-12-26 06:38 GMT

డిజిటల్ ప్రపంచంలో ఈ ఏడాది టాలీవుడ్ రారాజుగా అల్లు అర్జున్ నిలిచారు. 2025 గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ప్రకారం.. నెటిజన్లు అత్యధికంగా వెతికిన టాలీవుడ్ నటుడిగా బన్నీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. గత ఏడాది చివర్లో విడుదలైన పుష్ప 2: ది రూల్ సృష్టించిన సునామీ, ఈ ఏడాది పొడవునా అల్లు అర్జున్‌ను వార్తల్లో నిలిచేలా చేసింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడమే కాకుండా హిందీ బెల్ట్‌లో సైతం అఖండమైన ప్రజాదరణ పొందడం ఆయనకు ఈ అగ్రస్థానాన్ని తెచ్చిపెట్టింది.

గూగుల్ టాప్-5 జాబితా (డిసెంబర్ 24 నాటికి):

అల్లు అర్జున్: పుష్ప 2 సక్సెస్, క్రేజీ మూవీస్ లైనప్‌తో నంబర్ వన్.

ప్రభాస్: ది రాజా సాబ్, సలార్ 2 అప్‌డేట్స్‌తో రెండో స్థానం.

మహేష్ బాబు: రాజమౌళి ప్రాజెక్ట్‌పై ఉన్న ఆసక్తితో మూడో స్థానం.

పవన్ కల్యాణ్: అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో నిరంతరం వార్తల్లో ఉంటూ నాలుగో స్థానం.

జూనియర్ ఎన్టీఆర్: దేవర, వార్ 2 క్రేజ్‌తో ఐదో స్థానంలో నిలిచారు.

భవిష్యత్తు ప్రాజెక్టులపై భారీ అంచనాలు

అల్లు అర్జున్ కేవలం పాత సినిమాలతోనే కాకుండా రాబోయే చిత్రాలతోనూ సెర్చ్ ట్రెండ్స్‌లో దుమ్ములేపుతున్నారు. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సుమారు రూ. 800 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీ అండర్ వాటర్ ఫైట్స్ హైలైట్‌గా ఉండబోతున్నాయని సమాచారం. జికల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఒక గ్రాండ్ మైథలాజికల్ డ్రామాకు ఆయన సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News