Producer Naga Vamsi: ఆ మూవీ తెలుగులో తీస్తే ఫ్లాప్ అయ్యేది - నాగవంశీ
తెలుగులో తీస్తే ఫ్లాప్ అయ్యేది - నాగవంశీ
Producer Naga Vamsi: నిర్మాత నాగవంశీ తెలుగు, మలయాళ సినిమా ప్రేక్షకుల అభిరుచుల్లో ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రవితేజ కథానాయకుడిగా ఆయన నిర్మిస్తున్న
మాస్ జాతర చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మలయాళంలో ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన లోక - చాప్టర్ 1 వంటి చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తే అది ఘోర పరాజయం పాలవుతుందని అభిప్రాయపడ్డారు.
"మలయాళ ప్రేక్షకులు కథలోని భావోద్వేగాలకు సులభంగా కనెక్ట్ అవుతారు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం సినిమాలోని లాజిక్కుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఇదేం సినిమా? ఇందులో లాజిక్ ఎక్కడ ఉంది? అని ప్రశ్నిస్తారు. అలాంటి క్రాస్-కల్చరల్ సినిమా తెలుగులో వస్తే ప్రేక్షకులు తీవ్రంగా విమర్శిస్తూ, పచ్చి బూతులు కూడా తిడతారు" అని ఆయన అన్నారు. తెలుగులో అలాంటి కంటెంట్ ఆదరణ పొందడం కష్టమని ఆయన స్పష్టం చేశారు.
అదేవిధంగా తమ బ్యానర్‌లో గతంలో ఫ్లాప్ అయిన వార్ 2 సినిమా గురించి కూడా నాగవంశీ మాట్లాడారు. ఆదిత్య చోప్రాను నమ్మి సినిమా తీశామని, కానీ అది మిస్‌ఫైర్ అయిందని, సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన విషయాన్ని కూడా ఆయన అంగీకరించారు. ప్రస్తుతం నాగవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కాగా నాగవంశీ నిర్మిస్తున్న మాస్ జాతర చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది.