Actress Samantha: అలాంటి వారిని వెంటనే బ్లాక్ చేస్తా: సమంత
బ్లాక్ చేస్తా: సమంత
Actress Samantha: సోషల్ మీడియా ట్రోల్స్ కు మరోసారి గట్టి సందేశం ఇచ్చింది నటి సమంత రూత్ ప్రభు. ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటిస్తూ, తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై స్పష్ట మైన అభిప్రాయాలు వ్యక్తం చేసింది. నెగటివ్ కామెంట్లను ఎలా ఎదుర్కొంటారని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు, ప్రశంసలు తనను అతిగా పొంగిపోయేలా చేయవని, అలాగే ట్రోల్స్ కూడా తనను కుంగదీయవని సమంత చెప్పింది. తన డిజిటల్ స్పేస్లో నెగటివిటీకి మాత్రం తావులేదని స్పష్టం చేసింది. ఎవరు నెగటివ్ ఎనర్జీ తీసుకొస్తే వారిని వెంటనే బ్లాక్ చేస్తానని తెలిపింది.
తన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటానో, తన సోషల్ మీడియా పేజీని కూడా అలాగే క్లీన్ గా ఉంచుకుంటానని వ్యాఖ్యానించింది. బ్లాక్ చేయడం అనేది ద్వేషంతో కాదని, తన ప్రపంచంలోకి ప్రవే శానికి అనుమతి లేదన్న అర్థమని చెప్పింది. ఇన్స్టాగ్రా మ్ రీల్స్ వల్ల సమయం వృథా అవుతోందన్న ప్రశ్నకు స్పందిస్తూ, ఇది తనను కూడా భయపెడుతోందని అంగీకరించింది. చిన్నప్పుడు చదువుకు టైమ్ టేబుల్ ఉండేదని, ఇప్పుడు ఆ ఏకాగ్రత కోల్పోతున్నామే మోనన్న ఆందోళన వ్యక్తం చేసింది. ఫన్నీ విషయం చెప్పమన్న ప్రశ్నకు కిందపడి మరీ నవ్వుతానని చెప్పిన సమంత, ఎక్కువ ఒత్తిడి లేదా బాధకు గురైనప్పుడు ధ్యానం చేస్తానని వెల్లడించింది.