Roshan: చాంపియన్ తో పక్కా హిట్ కొడతా: రోషన్

పక్కా హిట్ కొడతా: రోషన్

Update: 2025-12-23 05:08 GMT

Roshan: విశాఖపట్నంలో చాంపియన్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. భారీ స్థాయిలో అభిమానులు తరలివచ్చారు. హీరో రోషన్ మేక (శ్రీకాంత్ కుమారుడు) చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

సాధారణంగా హీరోలు 25 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వస్తారని, కానీ తాను 21 ఏళ్లకే (తొలి చిత్రం 'పెళ్లిసందడి' తో) వచ్చానని ఆయన గుర్తు చేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో వచ్చిన గ్యాప్ గురించి మాట్లాడుతూ, "బ్రేక్ లాగా అనిపించవచ్చు కానీ, ఇది నాకు సరైన వయసు" అని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా ఒక పల్లెటూరి (బైరాన్ పల్లి) నేపథ్యంలో సాగుతుందని, ఇందులో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత, ప్రారంభం ముగింపు ఉంటాయని తెలిపారు.ఈ సినిమాతో పక్కా హిట్ కొడతాననే నమ్మకం ఉందన్నారు.

గతంలో సినిమాల మధ్య గ్యాప్ ఎక్కువ వచ్చిందని, ఇకపై అలా కాకుండా వచ్చే రెండేళ్లలో కనీసం మూడు సినిమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక బ్యానర్లలో పని చేయడం గర్వంగా ఉందని, దర్శకుడు ప్రదీప్ అద్వైతం తనపై నమ్మకం ఉంచి ఈ పాత్ర ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఈవెంట్‌లో తన తల్లి (మాజీ నటి ఊహ) గురించి మాట్లాడుతూ కొంత ఎమోషనల్ అయ్యారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్ తనకు అందిస్తున్న మద్దతును ప్రత్యేకంగా ప్రస్తావించారు. చాంపియన్ డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. రోషన్ కు హరోయిన్ గా అనస్వర రాజన్ నటిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News