P V’s Funny Reply to Rajamouli: మీ సినిమాలో నటించడానికి నేను రెడీ.. రాజమౌళికి పీవీ ఫన్నీ రిప్లై..

రాజమౌళికి పీవీ ఫన్నీ రిప్లై..

Update: 2026-07-21 06:10 GMT

P V’s Funny Reply to Rajamouli: భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపియన్ పీవీ సింధు అంతర్జాతీయ వేదికపై మరో సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నమెంట్‌ లో విజేతగా నిలిచి, ఈ టైటిల్ సాధించిన తొలి భారతీయ షట్లర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పారు. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో జపాన్ దిగ్గజ క్రీడాకారిణి అకనే యమగూచిపై 21-17, 21-17 తేడాతో వరుస సెట్లలో ఘనవిజయం సాధించారు. ఈ చారిత్రక విజయంపై క్రీడా లోకంతో పాటు చిత్ర పరిశ్రమ నుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

రాజమౌళి గ్రాండ్ విష్.. సింధు క్రేజీ రీ-ట్వీట్!

సింధు సాధించిన అద్భుత విజయంపై దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. "ఇది నిజమైన ఛాంపియన్ కంబ్యాక్.. నీ విజయాన్ని చూసి దేశమంతా గర్విస్తోంది సింధు" అంటూ ప్రశంసించారు.

రాజమౌళి ట్వీట్‌కు ధన్యవాదాలు తెలిపిన సింధు, ఆయనకు ఊహించని రీతిలో చమత్కారమైన ఆఫర్ ఇచ్చారు. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న వారణాసి సినిమా కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్తూనే.. "మీ రాబోయే సినిమాల్లో ఎప్పుడైనా ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర ఉంటే, ఒక కొత్త నటిగా మారడానికి నేను రెడీగా ఉన్నాను సార్" అంటూ ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్..

క్రీడా మైదానంలో ప్రత్యర్థులను చిత్తు చేయడమే కాకుండా సోషల్ మీడియాలో తన చమత్కారంతో సింధు నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి - సింధు మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. "సింధు స్క్రీన్ ప్రెజెన్స్ మామూలుగా ఉండదు.. జక్కన్న నిజంగానే ఆ ఛాన్స్ ఇస్తే రికార్డులే" అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News