Niharika Konidela on Vijay Antony’s Vanda Devullu: బిచ్చగాడు కంటే పెద్ద హిట్ అవ్వాలి.. విజయ్ ఆంటోని వంద దేవుళ్లు మూవీపై నిహారిక కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నిహారిక కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Niharika Konidela on Vijay Antony’s Vanda Devullu: విలక్షణ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా నటించిన సరికొత్త చిత్రం వంద దేవుళ్లు. భారీ అంచనాలున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నటి, నిర్మాత నిహారిక కొణిదెల ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విజయ్ ఆంటోని కెరీర్‌లోనే మైల్‌స్టోన్‌గా నిలిచిన బిచ్చగాడు చిత్రం సాధించిన విజయం కంటే.. ఈ వంద దేవుళ్లు ఇంకా పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.
అమ్మలోని అమ్మాయిని చూపించారు!
సినిమాపై నిహారిక కొణిదెల ప్రశంసలు కురిపిస్తూ.. "నేను ఈ చిత్రాన్ని ఇప్పటికే చూశాను. ప్రతి అమ్మలోనూ ఒక సాధారణ అమ్మాయి, ఆమెకు కొన్ని ఇష్టాలు ఉంటాయనే పాయింట్‌ను దర్శకుడు శశి స్క్రీన్‌పై అద్భుతంగా ఆవిష్కరించారు. విజయ్ ఆంటోని గారు కేవలం మంచి నటుడు మాత్రమే కాదు.. అంతకంటే గొప్ప వ్యక్తి. ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు ఆయనపై గౌరవం మరింత పెరిగింది. అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది" అని కొనియాడారు.
కథ విన్నప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాను: విజయ్ ఆంటోని
హీరో విజయ్ ఆంటోని మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. "దర్శకుడు శశి నాకు ఈ కథ చెప్పినప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి, కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. బిచ్చగాడు తర్వాత ఈ చిత్రంతో ఆయన నాకు మరో కొత్త జీవితాన్ని ఇచ్చారు" అని నమ్మకం వ్యక్తం చేశారు.
బిచ్చగాడుకి, వంద దేవుళ్లు కి తేడా ఇదే.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
చిత్ర దర్శకుడు శశి మాట్లాడుతూ ఈ రెండు సినిమాలకు ఉన్న ప్రధాన వ్యత్యాసాన్ని వివరించారు. "బిచ్చగాడు సినిమాకు ఇది పూర్తి భిన్నమైన కథ. అమ్మను ఒక దేవతలా చూస్తే అది బిచ్చగాడు అవుతుంది.. అదే అమ్మను ఒక సాధారణ మనిషిలా, ఒక స్త్రీగా చూస్తే అది వంద దేవుళ్లు అవుతుంది" అంటూ సినిమా కోర్ పాయింట్‌ను రివీల్ చేశారు.
జూన్ 19న గ్రాండ్ రిలీజ్
ఫాతిమా విజయ్ ఆంటోని సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజీ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో స్వాసిక, అజయ్ ధీషన్, లిజోమోల్ జోస్ కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.