Khushbu Sundar Reacts: అది వాళ్ల పర్సనల్ ..మీ కెందుకు.. విజయ్ -త్రిషలపై ఖుష్బు రియాక్షన్

విజయ్ -త్రిషలపై ఖుష్బు రియాక్షన్

Update: 2026-03-12 07:23 GMT

Khushbu Sundar Reacts: తమిళ స్టార్ హీరో విజయ్ , నటి త్రిషల మధ్య ఉన్న రిలేషన్ గురించి జరుగుతున్న ప్రచారంపై సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ తాజాగా స్పందించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు.

విజయ్, త్రిషల మధ్య ఏం జరుగుతుందనేది వారి వ్యక్తిగత విషయం .అందులో ప్రజలకు ఎందుకు అంత ఆసక్తి?" అని ఆమె ప్రశ్నించారు. వారి వ్యక్తిగత జీవితం వల్ల సమాజానికి లేదా ప్రజలకు వచ్చే నష్టం ఏమీ లేదని, కాబట్టి దాని గురించి చర్చించడం అనవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.విజయ్ ఒక పెద్ద నాయకుడు కావొచ్చు, కానీ అంతకంటే ముందు ఆయన కూడా మనలాంటి ఒక మనిషి. ఆయనకూ ప్రైవసీ ఉంటుంది" అని పేర్కొన్నారు.తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఈ వివాదం విజయ్ పార్టీ (TVK) ఇమేజ్‌ను దెబ్బతీస్తుందా అన్న ప్రశ్నకు.. "ప్రజలు చాలా తెలివైన వారు. ఎవరికి ఓటు వేయాలో వారికి తెలుసు. వ్యక్తిగత విషయాలను బట్టి ఓట్లు వేయరు" అని ఖుష్బూ స్పష్టం చేశారు.

గత కొద్ది రోజులుగా విజయ్ తన భార్య సంగీత నుండి విడాకులు తీసుకుంటున్నారని, దీనికి కారణం త్రిషతో ఉన్న సాన్నిహిత్యమే అని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల విజయ్ - త్రిష కలిసి ఒక వివాహ వేడుకకు హాజరైన ఫోటోలు బయటకు రావడంతో ఈ చర్చ మరింత ముదిరింది. ఈ నేపథ్యంలోనే ఖుష్బూ వారికి మద్దతుగా నిలిచారు. ఖుష్బూ స్వయంగా త్రిషకు మంచి స్నేహితురాలు కావడంతో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Tags:    

Similar News