J. D. Chakravarthy Clarifies: కల్కి 2లో జేడీ చక్రవర్తి? క్లారిటీ ఇచ్చేసిన నటుడు

క్లారిటీ ఇచ్చేసిన నటుడు

Update: 2026-04-30 11:56 GMT

J. D. Chakravarthy Clarifies: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన కల్కి 2898 ఏడీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

రూమర్లకు చెక్ పెట్టిన జేడీ

తన కొత్త చిత్రం గాయపడ్డ సింహం ప్రమోషన్స్‌లో భాగంగా జేడీ చక్రవర్తి ఈ వార్తలపై స్పందించారు. కల్కి 2లో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఏ షెడ్యూల్‌లోనూ పాల్గొనలేదని, కేవలం ఆ రూమర్లను విని ఎంజాయ్ చేశానని చెబుతూ ఈ ప్రచారానికి ముగింపు పలికారు.

సీక్వెల్ విశేషాలు:

ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండో భాగం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మొదటి భాగంలో కర్ణ, భైరవగా మెప్పించిన ప్రభాస్, పార్ట్-2లో మరో కొత్త గెటప్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాత్రల నిడివి ఈసారి మరింత ఎక్కువగా ఉండబోతోంది. మొత్తానికి జేడీ చక్రవర్తి వివరణతో ఆయన అభిమానుల్లో నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది.

Tags:    

Similar News