Faima’s Surprise Wedding: జబర్దస్త్ ఫైమా సడన్ మ్యారేజ్... వరుడు ఎవరంటే?

వరుడు ఎవరంటే?

Update: 2026-06-25 01:39 GMT

Faima’s Surprise Wedding: బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ సర్ప్రైజ్! జబర్దస్త్ షోలో తనదైన కామెడీ పంచ్‌లతో, గడుసుతనంతో అందరినీ నవ్వించిన ఫైమా.. తాజాగా పెళ్లి పీటలెక్కింది. ఎలాంటి హడావుడి లేకుండా, చాలా సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని అభిమానులకు ఒక్కసారిగా షాకిచ్చింది. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్ ప్రవీణ్ నాయక్‌ను ఫైమా వివాహం చేసుకుంది. అయితే వీరిద్దరూ ఈరోజో రేపో ప్రేమలో పడ్డవాళ్లు కాదు.. ఏకంగా తొమ్మిదేళ్లుగా పీకల్లోతు ప్రేమలో ఉన్నారట! ఎన్నో కష్టాలు, అడ్డంకులను అధిగమించి ఈరోజు ఒకటయ్యామని ఫైమా ఎమోషనల్ అయ్యింది.

"చాలామంది మమ్మల్ని అనుమానించారు.. విమర్శించారు.. మమ్మల్ని విడదీయాలని కూడా చూశారు. కానీ మా ప్రేమ ప్రతి అడ్డంకినీ అధిగమించి బలంగా నిలబడింది. లెక్కలేనన్ని పోరాటాలు.. అంతులేని సహనం.. ఒకరినొకరు వదిలేయడానికి వేయి కారణాలున్నా, మేము మాత్రం ప్రతిరోజూ ఒకరినే ఎంచుకున్నాం. ఫైనల్‌గా ఈ రోజు మేము భార్యాభర్తలం అయ్యాం.అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఫైమా అభిమానులు, తోటి జబర్దస్త్ కళాకారులు ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News