Jagadeesh in Lead Role: జగదీష్ లీడ్ రోల్ .. మటన్ మూవీ ఫస్ట్ లుక్
మటన్ మూవీ ఫస్ట్ లుక్
Jagadeesh in Lead Role: తగ్గేదే లే అంటూ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన పుష్ప సినిమాలో.. హీరో వెంటే ఉంటూ తనదైన యాసతో, నటనతో మెప్పించిన 'కేశవ' గుర్తున్నాడు కదా? అవును.. జగదీష్ ప్రతాప్ బండారి. తన సహజ సిద్ధమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ టాలెంటెడ్ యాక్టర్, ఇప్పుడు హీరోగా మన ముందుకు వస్తున్నారు. జగదీష్ లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మటన్'. టైటిల్‌తోనే వైవిధ్యం చూపించిన ఈ చిత్రం, ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తాజాగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే సినిమా చాలా రా అండ్ రస్టిక్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది. ఇందులో జగదీష్ 'బండారి' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఒంటి నిండా గాయాలు, మెడలో రుద్రాక్షలు, ముఖంపై ఆవేశం.. ఈ పోస్టర్ చూస్తుంటే ఏదో ఒక బలమైన ప్రతీకారం లేదా ఒక గంభీరమైన కథాంశం వెనుక ఉందన్న ఆసక్తి కలుగుతోంది. ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న త్రిశూలాలు సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతున్నాయి.
ఈ చిత్రానికి హర్షా డైస్ దర్శకత్వం వహించడమే కాకుండా స్వయంగా నిర్మిస్తున్నారు. ప్రతిభ ఉన్న నటీనటులను ఎంచుకోవడంలో హర్షా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తుండటం విశేషం. అంటే, కేశవగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జగదీష్, ఇప్పుడు తన హీరో ఇమేజ్‌తో ఇండియన్ సినిమాను పలకరించబోతున్నాడు.
ఈ చిత్రంలో జగదీష్‌తో పాటు మనస్వి, రాజేష్ కన్నా, రమేష్ మాదాసు, కిరీటి రాజ్ ముస్సి,రవివర్మ ఉప్పలపాటి వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒక విభిన్నమైన కథాంశంతో, పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ 'మటన్' చిత్రం జగదీష్ కెరీర్‌ను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.