Janhvi Kapoor: డీప్ ఫేక్ తో ఇప్పటికీ ఇబ్బందులే..జాన్వీ ఆవేదన
జాన్వీ ఆవేదన
Janhvi Kapoor: టెక్నాలజీ పెరిగేకొద్దీ సౌకర్యాలతో పాటు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా 'డీప్ ఫేక్' టెక్నాలజీ ఇప్పుడు సినీ తారలకు శాపంగా మారింది. ఇప్పటికే రష్మిక మందన్న, ఆలియా భట్ వంటి తారలు దీని బారిన పడగా.. తాజాగా అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ తనకు ఎదురైన ఒక భయంకరమైన అనుభవం గురించి నోరు విప్పారు. తాను కేవలం 15 ఏళ్ల వయసులోనే ఈ వేధింపులకు గురయ్యానని తెలిపి అందరినీ షాక్‌కు గురిచేశారు.
ఒక ప్రముఖ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన జాన్వీ.. తన టీనేజ్ రోజుల్లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కొన్ని పోర్న్ వెబ్‌సైట్లలో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి అప్‌లోడ్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 'నేను స్కూల్లో ఉన్నప్పుడు నా తోటి విద్యార్థులు ఆ సైట్లు ఓపెన్ చేసినప్పుడు నా మార్ఫ్‌డ్ ఫోటోలు కనిపించాయి. ఆ విషయాన్ని వాళ్లు నాకు చెప్పినప్పుడు నేను పడ్డ బాధ వర్ణనాతీతం. ఆ క్షణమే నాకు అర్థమైంది.. సోషల్ మీడియాలో కనీస నైతికత ఉండదని' అంటూ జాన్వీ భావోద్వేగానికి లోనయ్యారు.
అప్పుడు చిన్న వయసు కావడంతో ఏమీ చేయలేకపోయానని, కానీ ఇప్పటికీ డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల తనకు సమస్యలు వస్తూనే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. కేవలం జాన్వీనే కాదు, ఎంతోమంది నటీమణులు ఈ కృత్రిమ మేధస్సు (AI) సృష్టిస్తున్న వికృత చేష్టల వల్ల మానసిక వేదనను అనుభవిస్తున్నారు. కేవలం సెలబ్రిటీలే కాదు, సామాన్య మహిళలు కూడా ఈ డిజిటల్ దాడులకు గురవుతున్నారని ఆమె హెచ్చరించారు.