Junior NTR’s Costly Gift : బావమరిదికి జూనియర్ ఎన్టీఆర్ కాస్ట్లీ గిఫ్ట్..

జూనియర్ ఎన్టీఆర్ కాస్ట్లీ గిఫ్ట్..

Update: 2025-10-14 08:58 GMT

Junior NTR’s Costly Gift : టాలీవుడ్‌ యంగ్‌ హీరో నార్నె నితిన్‌ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. నెల్లూరుకు చెందిన శివానీతో నితిన్‌ వివాహం అక్టోబర్‌ 10న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

నితిన్ కొత్తగా సినిమాల్లోకి వచ్చినా ఇప్పటికే మ్యాడ్, ఆయ్, మ్యాడ్ స్క్వేర్ వంటి హ్యాట్రిక్ హిట్స్‌తో రికార్డు సృష్టించాడు. ఈయన పారిశ్రామికవేత్త నార్నె శ్రీనివాసరావు కుమారుడు.

పెళ్లి వేడుకలో ఎన్టీఆర్‌ దంపతులు*

ఈ వివాహ వేడుకకు నార్నె నితిన్ బావ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దంపతులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఆ ఇంటి ఆడపిల్ల కావడంతో పెళ్లి కార్యక్రమాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ సహాయం వల్లే తనకు సినిమా అవకాశాలు వచ్చాయని నితిన్ గతంలో చెప్పడం జరిగింది.

బావమరిదికి ఎన్టీఆర్‌ స్పెషల్ గిఫ్ట్..?

నితిన్ పెళ్లి సందర్భంగా ఎన్టీఆర్ తన బావమరిదికి ఎలాంటి బహుమతి ఇచ్చారనే చర్చ సోషల్‌మీడియాలో జోరుగా సాగుతోంది. పెళ్లి కానుకగా ఎన్టీఆర్‌ ఒక లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నితిన్‌పై ఎన్టీఆర్‌కు ఉన్న ప్రేమ, అభిమానం కారణంగానే ఈ ఖరీదైన బహుమతి ఇచ్చారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ లేదా నితిన్ కుటుంబం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Tags:    

Similar News