Kajal Aggarwal: లాయర్‌గా కాజల్ అగర్వాల్ పవర్‌ఫుల్ రీఎంట్రీ..

రీఎంట్రీ..

Update: 2026-06-06 06:53 GMT

Kajal Aggarwal: చాలా కాలం తర్వాత చందమామ కాజల్ అగర్వాల్ ఒక పవర్‌ఫుల్, సామాజికంగా ఆలోచింపజేసే కథతో మన ముందుకు రాబోతోంది. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో, శ్రేయస్ తల్ఫడే కీలక పాత్రలో రూపొందుతున్న సరికొత్త చిత్రం ‘ది ఇండియన్ స్టోరీ’. ఒక ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ సినిమా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మాత్రమే కాదు.. సమాజంలో ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేసే ఒక భయంకరమైన నిజాన్ని ప్రశ్నించడానికి వస్తోంది. మనం రోజూ తినే ఆహారంలో జరుగుతున్న కల్తీ, వ్యవసాయంలో విచ్చలవిడిగా వాడుతున్న పురుగుమందులు.. వాటి వల్ల సామాన్య ప్రజల ఆరోగ్యం ఎలా ప్రమాదంలో పడుతోంది అనే సీరియస్ అంశాన్ని ప్రధానంగా తీసుకుని దర్శకుడు చేతన్ డీకే ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.

ఈ టీజర్‌లో చూపించిన కొన్ని లీగల్ గణాంకాలు చూస్తుంటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. ‘‘మనం దేశంలో 50 వేలకు పైగా మెట్రిక్ టన్నుల పురుగు మందులను వాడుతున్నాం.. దీనివల్ల దాదాపు 20 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన అనారోగ్య బారిన పడ్డారు.. ప్రస్తుతం దేశంలో ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబం భయంకరమైన క్యాన్సర్‌తో పోరాడుతోంది.. ప్రతి ఏడాది పది లక్షల మంది చనిపోతున్నారు..” అంటూ టీజర్‌లో చూపించిన వాస్తవాలు.. సమాజం ఏ వైపు వెళ్తుందో ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ విస్తుపోయే నిజాల వెనుక ఉన్న మాఫియాను ఎదిరించే ఒక పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించబోతోంది.

జీ స్టూడియోస్ సమర్పణలో సాగర్ బి షిండే ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ లాయర్ కోటు వేసుకుని కోర్టు బోనులో అడిగే ప్రశ్నలు, శ్రేయస్ తల్ఫడే నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సమాజంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఎన్నో భయంకరమైన నిజాలను ఈ సినిమాలో లీగల్ డ్రామా రూపంలో చూపించబోతున్నట్టు స్పష్టమవుతోంది.

ఈ సామాజిక కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ చిత్రం.. జులై 24న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. మరి ఈ ‘ది ఇండియన్ స్టోరీ’తో కాజల్ అగర్వాల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో.. సమాజంలో ఎలాంటి మార్పు తీసుకువస్తుందో చూడాలి.

Tags:    

Similar News