Kangana Ranaut: చిరాగ్ పాస్వాన్‌తో డేటింగ్? క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్!

క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్!

Update: 2026-04-17 10:41 GMT

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, నటి కంగనా రనౌత్ గత కొంతకాలంగా తనపై వస్తున్న ప్రేమ వార్తలకు చెక్ పెట్టారు. బీహార్‌కు చెందిన రాజకీయ నాయకుడు చిరాగ్ పాస్వాన్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కంగనా గట్టిగా ఖండించారు. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని, అది కూడా చాలా పవిత్రమైనదని ఆమె స్పష్టం చేశారు.

ఈ పుకార్లపై కంగనా స్పందిస్తూ.. చిరాగ్ తనకు "కేవలం స్నేహితుడు" మాత్రమేనని, వారిద్దరికీ దాదాపు పదేళ్ల క్రితం నుంచే పరిచయం ఉందని గుర్తు చేశారు. ఒక దశాబ్దం క్రితమే తాము కలిసి పనిచేశామని, అప్పటి నుండి ఇప్పటి వరకు మంచి స్నేహితులుగానే కొనసాగుతున్నామని ఆమె వెల్లడించారు.

తనదైన శైలిలో సమాధానమిచ్చిన కంగనా.. ఒకవేళ తమ మధ్య ప్రేమ అనే కోణం ఉండి ఉంటే, అది ఎప్పుడో పదేళ్ల క్రితమే మొదలయ్యేదని వ్యాఖ్యానించారు. తమ మధ్య ఎంతో సాన్నిహిత్యం, గౌరవం ఉన్న మాట నిజమే కానీ, అది స్నేహానికి మించి ఏమీ లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, మా మధ్య ఎటువంటి రోమాన్స్ లేదని చెబుతూ ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు.

Tags:    

Similar News