Vishwambhara: చిరుతో కన్నడ బ్యూటీ ఐటమ్ సాంగ్!
ఐటమ్ సాంగ్!;
Vishwambhara: చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమాలో బ్యాలన్స్ ఉన్న ఒకే ఒక్క ఐటెం సాంగ్ సమస్యకు పరిష్కారం లభించిందనే అప్డేట్ వస్తోంది. శాండల్ వుడ్ భామ నిశ్విక నాయుడును లాక్ చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. కన్నడ సినిమాలు ఫాలో అయ్యేవాళ్ళు ఈ అమ్మడిని బాగా గుర్తుపడతారు. బిచ్చగాడు శాండల్ వుడ్ రీమేక్ మూవీ అమ్మ ఐ లవ్ యుతో 2018లో వచ్చిన నిష్విక ఇప్పటిదాకా తొమ్మిదికి పైగానే సినిమాలు చేసింది. గత ఏడాది శివరాజ్ కుమార్, ప్రభుదేవాల కరటక దమనకలో నటించింది. పుట్టి పెరిగింది, చదివింది అంతా బెంగళూరులోనే. కానీ ఈ అమ్మడిది తెలుగు మూలాలున్న కుటుంబం. మరి పెద్దగా పాపులా రిటీ లేని అమ్మాయిని ఎంచుకోవడం వెనుక దర్శకుడు వశిష్ఠ స్ట్రాటజీ ఏంటో? ఈ ఒక్క పాటను భీమ్స్ సిసిరోలి యో కంపోజ్ చేస్తున్నాడు. ఇది కూడా అఫీషియల్ గా చెప్పలేదు. టీమ్ దాచిపెడితే లీకైపోయింది. దీనిపై యువీ క్రియేషన్స్ సమర్థిస్తూ, ఖండిస్తూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ కు ఓటిటి, జీ ఛానల్ కు శాటిలైట్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. చిరు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కు ఉండే క్రేజ్ వేరు. ఖైదీ నంబర్ 150 రాయ్, వాల్తేర్ వీరయ్యలో ఊర్వశి రౌతేలా అదరగొట్టారు. మరి ఇప్పుడు కన్నడ హాట్ నిశ్విక ఏ రేంజ్ లో చిరుతో డాన్స్ చేస్తుందో చూడాలి. మరోవైపు మెగాస్టార్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా చేస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందనుండగా.. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.