13న కన్నప్ప టీజర్ విడుదల

Update: 2025-06-10 14:35 GMT

మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ముకేశ్ కుమార్ సింగ్ తెర‌కెక్కిస్తోన్న క‌న్న‌ప్ప సినిమా ట్రైల‌ర్ విడుద‌ల‌పై మేక‌ర్స్ కీల‌క అప్‌డేట్ ఇచ్చారు. ఈ నెల 13న ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. కాగా, ఈ సినిమా జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. మంచు విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ పౌరాణిక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పరమశివుని గొప్ప భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను ఇప్ప‌టికే మేక‌ర్స్ ముమ్మ‌రం చేశారు. 'కన్నప్ప' చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా... మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ వంటి అగ్ర తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ పరమశివుడిగా కనిపించనుండగా, కాజల్ అగర్వాల్ పార్వతీ దేవి పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు మోహన్ బాబు, శరత్‌కుమార్, అర్పిత రంకా, కౌశల్ మందా, బ్రహ్మానందం వంటి ప్రముఖ నటీనటులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఇప్పటికే విడుదలైన 'కన్నప్ప' టీజర్, పాట‌లు, పోస్ట‌ర్లు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి. ట్రైల‌ర్‌తో మ‌రింత జోష్ రావ‌డం ఖాయ‌మ‌ని చిత్ర‌బృందం భావిస్తోంది.

Tags:    

Similar News