Kantara Chapter 1: రూ.400 కోట్ల క్లబ్ లోకి...కాంతారా చాప్టర్ 1
కాంతారా చాప్టర్ 1
Kantara Chapter 1: రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన 'కాంతార: చాప్టర్ 1 బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 400 కోట్ల మైలురాయిని దాటినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భారతదేశంలో 6 రోజుల నెట్ వసూళ్లు మొత్తం సుమారు రూ.290.25 కోట్ల నెట్, 6వ రోజు (మంగళవారం) వసూళ్లు సుమారు రూ.33.5 కోట్ల (నెట్)
ప్రపంచవ్యాప్తంగా (Worldwide) 6 రోజుల మొత్తం వసూళ్లు సుమారు రూ.400 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. కన్నడ లో రూ.89.35 కోట్లు, హిందీలో రూ.93.25 కోట్లు, తెలుగులో రూ. 57.4 కోట్ల,తమిళం రూ. 24.75 కోట్లు, మలయాళంలో రూ.20.9 కోట్లు నెట్ కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. కన్నడ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది.
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈమూవీ తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది.లాంగ్ రన్ లో ఈ మూవీ 800 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.