Kantara Chapter 1 Storms the Box Office: దుమ్ములేపుతోన్న కాంతార చాప్టర్ 1..రూ.500 కోట్లు దాటిన కలెక్షన్లు

రూ.500 కోట్లు దాటిన కలెక్షన్లు

Update: 2025-10-11 05:22 GMT

Kantara Chapter 1 Storms the Box Office: కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ చిత్రం విడుదలైన మొదటి వారం (8 రోజులు)లో ప్రపంచవ్యాప్తంగా రూ.509.25 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఇది కన్నడ చిత్ర పరిశ్రమలో 'KGF: Chapter 2' తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ అతిపెద్ద చిత్రం.భారతదేశంలో మొత్తం రూ. 334.94 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు అయినట్లు సమాచారం.

ఈ సినిమా కథ 8వ శతాబ్దంలో కదంబుల రాజవంశ కాలంలో మొదలవుతుంది. ఇది బనవాసి అడవులలోని 'కాంతార' అనే దైవిక భూమి నేపథ్యంలో సాగుతుంది. ఈ ప్రీక్వెల్‌లో, మొదటి భాగంలో చూపించిన పంజుర్లి, గుళిగ దైవాల మూలాలు, భూతకోల ఆచారం వెనుక ఉన్న చరిత్ర, ఆ ఆధ్యాత్మిక నమ్మకాలు ఎలా పుట్టాయనే విషయాలను లోతుగా అన్వేషిస్తారు. రిషబ్ శెట్టి 'బెర్మే' అనే యువకుడి పాత్రను పోషించారు. బెర్మే దైవానుగ్రహంగా అడవిలో దొరికిన బిడ్డ. అడవి ప్రజల (గిరిజనుల)కు రక్షకుడిగా ఉంటాడు.

అడవిలోని పవిత్రమైన 'ఈశ్వరుడి పూదోట' ఆ ప్రాంతంపై భాంగ్రా రాజవంశానికి చెందిన రాజుల (జయరాం, గుల్షన్ దేవయ్య పాత్రలు) కన్ను పడుతుంది. ఈశ్వరుడి పూదోటలోని రహస్యం కోసం, ఆ ప్రాంతాన్ని తమ సొంతం చేసుకోవడం కోసం రాజులు చేసే ప్రయత్నాలు, దానిని కాపాడుకోవడానికి బెర్మే , గిరిజన తెగ చేసే పోరాటమే ప్రధాన కథాంశం.మొదటి భాగం మాదిరిగానే, ఈ చిత్రం కూడా యాక్షన్, దైవత్వం, ప్రకృతికి, మానవులకు మధ్య ఉన్న సంబంధాన్ని అద్భుతంగా మేళవించి, ప్రేక్షకులను ఒక దివ్యమైన అనుభూతిలోకి తీసుకెళ్తుంది.

Tags:    

Similar News