Kantara Chapter 1 Update: కాంతార చాప్టర్1 అప్ డేట్..ట్రైలర్ ఎపుడంటే.?
ట్రైలర్ ఎపుడంటే.?
Kantara Chapter 1 Update: కాంతార: చాప్టర్ 1' సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 22న విడుదల కానుంది. చిత్ర బృందం దీనిపై అధికారిక ప్రకటన చేసింది. ట్రైలర్ సెప్టెంబర్ 22, మధ్యాహ్నం 12:45 గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. కాంతార: చాప్టర్ 1' అనేది 'కాంతార' (2022) సినిమాకి ప్రీక్వెల్ . ఈ సినిమా మొదటి 'కాంతార'లో చూపించిన దైవత్వం, భూతకోల, అడవి, మనుషుల మధ్య సంబంధానికి మూల కథను వివరిస్తుంది. ఈ ప్రీక్వెల్‌లో దైవం ఎలా పుట్టింది, అడవిని సంరక్షించడానికి దైవానికి ఎందుకు ఇంత శక్తి ఇచ్చారు అనే విషయాలను చూపిస్తారు.
ఈ సినిమాని కూడా రిషబ్ శెట్టియే రచించి దర్శకత్వం వహించారు. ఆయనే ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.కాంతార' సాధించిన విజయం తర్వాత, ఈ ప్రీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. గతంలో 'కాంతార' 16 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా, ఈ ప్రీక్వెల్‌కు దాదాపు 125 కోట్ల బడ్జెట్ కేటాయించారు.హోంబలె ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంతో గుల్షన్ దేవయ్య కన్నడ ఎంట్రీ ఇస్తున్నాడు. బి.అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్రం కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ మరియు ఇంగ్లీష్ భాషలలో విడుదల కానుంది. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.