Kantara Glimpse: అంచనాలు పెంచిన కాంతార గ్లింప్స్..ఇది సినిమా కాదు ఒక శక్తి

ఇది సినిమా కాదు ఒక శక్తి;

Update: 2025-07-21 10:34 GMT

Kantara Glimpse:రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం కాంతార ఏ లెజెండ్ - ఛాప్టర్ 1కి సంబంధించి లేటెస్ట్ గా గ్లింప్స్ విడుదలయ్యింది. సినిమా నిర్మాణం పూర్తయిన సందర్భంగా వరల్డ్ ఆఫ్ కాంతార పేరుతో చిత్ర యూనిట్ ఈ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్ సినిమా నిర్మాణ దశను, భారీ యాక్షన్ సన్నివేశాలను, కష్టపడిన తీరును చూపించి అభిమానులను ఆకట్టుకుంది.

సినిమా షూటింగ్ దాదాపు 250 రోజులు జరిగిందని గ్లింప్స్ లో రిషబ్ షెట్టి తెలిపాడు. భారీ యాక్షన్ సన్నివేశాలు, ముఖ్యంగా 25 ఎకరాల విస్తీర్ణంలో చిత్రీకరించిన యుద్ధ సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమా కేవలం ఒక చిత్రం కాదని, ఒక దైవిక శక్తి అని రిషబ్ శెట్టి చెప్పాడు. ఈ గ్లింప్స్ వీడియో సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమా కూడా తొలి భాగం మాదిరిగానే ఘన విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

కాంతార: ఏ లెజెండ్ - ఛాప్టర్ 1 అనేది 2022లో వచ్చిన 'కాంతార చిత్రానికి ప్రీక్వెల్. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది.

Tags:    

Similar News