‘Karuppu’: వరల్డ్ వైడ్‌గా ‘కరుప్పు’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
‘కరుప్పు’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
‘Karuppu’: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కరుప్పు’.. థియేటర్లలో పవర్‌ఫుల్ ఓపెనింగ్స్‌తో దూసుకుపోతోంది. నిజానికి ఈ సినిమా మే 14నే విడుదల కావాల్సి ఉన్నా, చివరి నిమిషంలో కొన్ని ఆర్థిక సమస్యల వల్ల షోలు రద్దయ్యాయి. దీంతో ఒకరోజు ఆలస్యంగా మే 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ ఆటంకాలు ఏవీ సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి రోజే ఇండియాలో రూ.17.93 కోట్ల గ్రాస్, రూ.15.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇక ఓవర్సీస్‌లోనూ సూర్య క్రేజ్ గట్టిగానే పనిచేసింది. విదేశాల్లో మరో రూ.4 కోట్ల గ్రాస్ రాబట్టడంతో.. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే ఈ సినిమా ఏకంగా రూ.21.93 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను తన ఖాతాలో వేసుకుంది.
దేశవ్యాప్తంగా దాదాపు 4,891 షోలలో ప్రదర్శితమైన ఈ చిత్రం.. 50.35 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ముఖ్యంగా నైట్ షోలకు ఫ్యాన్స్ ,ఆడియన్స్ నుంచి భారీ స్పందన లభించింది. అయితే సూర్య కెరీర్ బెస్ట్ ఓపెనర్ కంగువ సాధించిన రూ.22 కోట్ల నెట్ రికార్డును, అలాగే కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఆయన గత చిత్రం ‘రెట్రో’ సాధించిన రూ.19.25 కోట్ల నెట్ కలెక్షన్ల రికార్డును మాత్రం ‘కరుప్పు’ అందుకోలేకపోయింది.
ఏదేమైనప్పటికీ, మొదటి రోజే ఆర్థిక ఇబ్బందులను దాటుకుని వచ్చి ఇంతటి భారీ వసూళ్లు సాధించడం విశేషం. ప్రస్తుతం సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు సోషల్ మీడియాలో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ వీకెండ్‌లో ‘కరుప్పు’ బాక్సాఫీస్ కలెక్షన్ల వేగం మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.