Katrina Kaif: ఆ స్టార్ హీరోలతో బ్రేకప్ తర్వాత ఫుల్‌గా ఏడ్చిన కత్రినా
బ్రేకప్ తర్వాత ఫుల్‌గా ఏడ్చిన కత్రినా;
Katrina Kaif: తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది నటి కత్రినా కైఫ్. విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తోంది. జూలై 16 ఇవాళ తన పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆమె పాత రోజులను గుర్తు చేసుకున్నది. బ్రేకప్స్ తర్వాత చాలా బాధపడినట్లు కత్రినా తెలిపింది. అంతేకాదు విపరీతంగా ఏడ్చిందట.
కత్రినా కైఫ్ గతంలో సల్మాన్ ఖాన్ తో ప్రేమలో ఉండేది. వారు 2005లో వారు ప్రేమలో పడ్డారు. అయితే సల్లూతో విడిపోయాక కత్రినా ఫుల్ ఏడ్చిందట. విడిపోయిన తర్వాత కూడా.. 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' మరియు 'టైగర్ 3' వంటి సినిమాలు చేశారు. ఆ తర్వాత రణబీర్ కపూర్‌ను లవ్ చేసింది ఈ భామ. 2009 నుంచి 2016 వరకు వీరు ప్రేమలో మునిగితేలారు. ఆ తర్వాత కత్రినా, రణ్‌బీర్ విడిపోయారు. రణ్‌బీర్ లైంగిక వేధింపుల కారణంగా కత్రినా అతనితో విడిపోయిందని వార్తలు వినిపించాయి.
మళ్లీ బ్రేకప్ తర్వాత తాను బాగా ఏడ్చినట్లు కత్రినా చెప్పింది. ‘‘నేను కూడా మనిషినే.' నాకూ ఎమోషన్స్ ఉంటాయి’’ అని ఆమె తెలిపింది. ఆ తర్వాత విక్కీ కౌశల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటుంది.