katrina kaif: తల్లికాబోతున్న స్టార్ హీరోయిన్..బేబీ బంప్ ఫోటోలతో గుడ్ న్యూస్
బేబీ బంప్ ఫోటోలతో గుడ్ న్యూస్
katrina kaif: బాలీవుడ్ స్టార్ కపూల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను కత్రినా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని చెబుతూ ఈ ఫోటోను పంచుకున్నారు. కత్రినా గర్భం దాల్చారనే వార్త బయటకు వచ్చిన తర్వాత, అభిమానులు, సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తూ వారికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కత్రినా కైఫ్ , విక్కీ కౌశల్ 2021 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో గల సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో వివాహం చేసుకున్నారు. పెళ్ళైన నాటి నుంచి ఈ జంట తరచుగా తమ ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు.
కత్రినా కైఫ్ బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన నటీమణులలో ఒకరు. ఆమె 'జబ్ తక్ హై జాన్',టైగర్ జిందా హై, సూర్యవంశీ' వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగులో మల్లీశ్వరీ,బాలకృష్ణ అల్లరి పిడుగులో నటించారు.