KGF Actor Harish Roy: కేజీఎఫ్ నటుడు కన్నుమూత

నటుడు కన్నుమూత

Update: 2025-11-06 09:51 GMT

KGF Actor Harish Roy: కేజీఎఫ్ నటుడు హరీశ్ రాయ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. KGF-1లో హరీశ్ రాయ్.. ఛాఛా అనే పాత్రలో నటించారు. క్యాన్సర్ కారణంగా గొంతు వాపును దాచడానికి ఆయన 'కేజీఎఫ్' షూటింగ్ సమయంలో గడ్డం పెంచారు.రెండో పార్ట్ రిలీజైన నాటికే ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అది నాలుగో స్టేజీకి చేరడంతో పూర్తిగా బక్కచిక్కిపోయారు. ఆర్థిక సాయం చేయాలని కోరగా నటుడు ధ్రువ్ సర్జా హెల్ప్ చేశారు. పరిస్థితి చేజారిపోవడంతో ఆయన మరణించారు.ఓం, తాయవ్వ, సమర, బెంగళూరు అండర్‌వరల్డ్, జోడిహక్కి, రాజ్ బహదూర్, సంజు వెడ్స్ గీత, స్వయంవర, మిందుం ఒరు కాదల్ కధై ఉన్నాయి. కన్నడ, తమిళం , తెలుగు బాషల్లో ఆయన 90కి పైగా చిత్రాలలో నటించారు.

Tags:    

Similar News