Khushbu’s Daughter : సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్న ఖుష్బూ వారసురాలు.. ఫస్ట్ మూవీ ఎవరితోనంటే..?
ఫస్ట్ మూవీ ఎవరితోనంటే..?
Khushbu’s Daughter : సౌత్ ఇండియాలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగి, ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఖుష్బూ సుందర్ వారసురాలు వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఖుష్బూ పెద్ద కుమార్తె అవంతిక సుందర్ హీరోయిన్‌గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. విశేషం ఏమిటంటే, తల్లి బాటలోనే ఆమె కూడా మలయాళ చిత్ర పరిశ్రమను తన అరంగేట్రం కోసం ఎంచుకున్నారు.
తల్లి బాటలో.. మలయాళ చిత్రంతోనే..
సరిగ్గా 35 ఏళ్ల క్రితం (1991లో), ఖుష్బూ కూడా మోహన్ లాల్ సరసన 'అంకుల్ బన్ అనే మలయాళ చిత్రంతోనే తన కెరీర్‌ను ప్రారంభించారు. ఇప్పుడు అవంతిక కూడా అదే ఇండస్ట్రీని ఎంచుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆమె నటిస్తున్న ఈ డెబ్యూ మూవీకి ఆరంభం అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ సినిమాలో అవంతిక ఆరతి'
అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. కేరళలోని త్రిశూర్ జిల్లా చావక్కాడ్‌లో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రస్తుతం కున్నంకుళం, చావక్కాడ్, కొల్లంగోడ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను మలయాళంతో పాటు తమిళంలో కూడా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని సుజేష్ అన్నీ ఈపెన్ దర్శకత్వం వహిస్తుండగా, స్టూడియో బెల్లారూహ్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇంద్రన్స్, విజయరాఘవన్, అల్తాఫ్ సలీం, కళాభవన్ షాజోన్ వంటి హేమాహేమీలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ కంపోజర్ గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా, అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.