Kiara Advani: కెరీర్ కష్టాలను గుర్తుచేసుకున్న కియారా అడ్వాణీ

కియారా అడ్వాణీ

Update: 2026-05-11 07:46 GMT

Kiara Advani: బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అడ్వాణీ.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతోంది. త్వరలోనే కన్నడ స్టార్ యశ్‌తో కలిసి ‘టాక్సిక్’ చిత్రంలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ స్థాయికి చేరుకోవడం కియారాకు అంత సులభంగా ఏమీ సాధ్యం కాలేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కియారా తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. చాలామంది ‘ఎం.ఎస్. ధోని’ లేదా ‘కబీర్ సింగ్’ ఆమె మొదటి సినిమాలని అనుకుంటారు. కానీ, ఆమె నటించిన తొలి చిత్రం ‘ఫుగ్లీ’ అన్న విషయం చాలామందికి తెలియదు.

ఫుగ్లీ విజయం సాధించకపోవడంతో నా కెరీర్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఆ సినిమా ఆడకపోవడంతో చాలా కాలం గ్యాప్ వచ్చింది. నటనకు ప్రశంసలు దక్కినా, అవకాశాలు మాత్రం రాలేదు’’ అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు కియారా.

మళ్లీ మొదటి నుంచి ఆడిషన్స్ ఇవ్వడం, తిరస్కరణలను ఎదుర్కోవడం.. ఇలా ఎన్నో సవాళ్లను దాటుకుని ఇక్కడికి వచ్చానని ఆమె తెలిపారు. ఆ కష్టాలే తనకు గురువులుగా మారి మార్గనిర్దేశం చేశాయని కియారా ఎమోషనల్ అయ్యారు.

Tags:    

Similar News