‘Devaraya’: శ్రీకృష్ణదేవరాయగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ టైటిల్ గ్లింప్స్ విడుదల
‘దేవరాయ’ టైటిల్ గ్లింప్స్ విడుదల
‘Devaraya’: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ చిత్రం ‘దేవరాయ’ నుంచి మేకర్స్ గ్రాండ్ అప్‌డేట్ ఇచ్చారు. సినిమాకు టైటిల్‌ను ప్రకటించడంతో పాటు, విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన దిగ్గజ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయగా సుదీప్‌ను పరిచయం చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుప్రియాన్వి పిక్చర్ స్టూడియోపై ప్రియా సుదీప్ సమర్పిస్తున్నారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోలో ‘దేవరాయ’ కథా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ, భారీ స్థాయిలో తెరకెక్కుతున్న పీరియాడిక్ విజువల్ స్పెక్టకిల్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన దృశ్యాలను చూపించారు.
గౌర హరి అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌కు మరింత గ్రాండియర్ లుక్‌ను తీసుకొచ్చింది. రాజసంగా కనిపించే శ్రీకృష్ణదేవరాయ పాత్రలో సుదీప్ ఆకట్టుకున్నారు. పోస్టర్, వీడియోలోని ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్, విజువల్ ఎలిమెంట్స్ ఆ కాలం నాటి వాతావరణాన్ని, శ్రీకృష్ణదేవరాయ స్థాయిని ప్రతిబింబించేలా ఉన్నాయి.
“చరిత్రను మలిచిన సామ్రాజ్యం. ఒక శకాన్ని నిర్వచించిన రాజు. కాలాన్ని దాటి నిలిచిపోయిన ఓ దిగ్గజం” అనే మూడు వాక్యాలతో మేకర్స్ ‘దేవరాయ’ను పరిచయం చేశారు.
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 డిసెంబర్‌లో థియేటర్లలోకి రానుంది.