‘Hatah’: ‘హతః’ అంటూ కిరణ్ అబ్బవరం కొత్త ప్రయోగం.. అసలు ఆ పిల్లి కథేంటి?
అసలు ఆ పిల్లి కథేంటి?
‘Hatah’: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరోసారి తన ప్రొడక్షన్‌లో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న కొత్త సినిమాకు ‘హతః (Hatah)’ అనే టైటిల్‌ను ప్రకటించారు. అయితే ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను కూడా మామూలుగా కాకుండా చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేయడంతో సినిమా మీద ఆసక్తి మొదలైంది.
హతః’ టైటిల్ గ్లింప్స్‌లో మొదట ఓ చీకటి పెట్టెలో ఉన్న నల్ల పిల్లిని చూపించారు. కెమెరా నెమ్మదిగా ఆ పెట్టె వైపు జూమ్ అవుతుండగా, చివర్లో ‘HATAH’ అనే టైటిల్‌ను రివీల్ చేశారు. దీనికితోడు “Is the cat alive or..?” అంటూ మేకర్స్ వేసిన ప్రశ్న ఇప్పుడు ఈ సినిమా అసలు కథ ఏంటి అనే క్యూరియాసిటీని పెంచుతోంది. హీరో ఎవరు, కథ ఏంటి అనే విషయాలను పూర్తిగా దాచిపెట్టి కేవలం ఒక పిల్లిని సెంట్రల్ ఎలిమెంట్‌గా చూపించడం అనౌన్స్‌మెంట్‌లో ప్రత్యేకంగా నిలిచింది.
ఇప్పటివరకు ఈ సినిమా కథ, జానర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ బయటపెట్టలేదు. అయితే ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని తరహా కథతో ఈ సినిమా ఉండబోతుందని టీమ్ చెబుతోంది. టైటిల్ గ్లింప్స్‌లో ఇచ్చిన చిన్న క్లూ, మిస్టరీగా ఉంచిన కాన్సెప్ట్ కారణంగా ‘హతః’పై అప్పుడే చర్చ మొదలైంది. సినిమా గురించి మరిన్ని విషయాలను త్వరలో విడుదల చేయబోయే టీజర్‌లో వెల్లడించనున్నట్టు కిరణ్ అబ్బవరం కూడా తెలిపారు.
ఈ సినిమాను కిరణ్ అబ్బవరం, పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి నిర్మిస్తున్నారు. అనుష్ గోరక్ ఈ చిత్రానికి కథ, దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. కుష్లు మద్దాల, రెహ్మాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జెసిన్ జార్జ్ సంగీతం అందిస్తుండగా, అఖిల్ చక్రవర్తి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.