Kishkindhapuri Success Meet: కిష్కింధపురి సక్సెస్ మీట్..వారం రోజుల కలెక్షన్లు ఎన్ని కోట్లు అంటే?

వారం రోజుల కలెక్షన్లు ఎన్ని కోట్లు అంటే?

Update: 2025-09-19 10:15 GMT

Kishkindhapuri Success Meet: కిష్కింధపురి' సినిమా సెప్టెంబర్ 12న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కౌశిక్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రం రిలీజ్ అయిన వారం కంప్లీట్ కావడంతో యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ముఖ్య అతిథిగా వచ్చిన హీరో సాయి దుర్గా తేజ్, 'కిష్కింధపురి' విజయం మొత్తం పరిశ్రమ విజయంగా అభివర్ణించారు. ఇలాంటి కొత్త కథలను ప్రోత్సహించడం చాలా అవసరమని, ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే కొత్తదనం ఉండాలన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, 'కిష్కింధపురి' సినిమా చూశానని, హారర్ జానర్ లో ఇంత మంచి సినిమా తీసినందుకు చిత్ర బృందాన్ని అభినందించారు.

సినిమాకు వస్తున్న స్పందన పట్ల బెల్లంకొండ శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. కేవలం మూడు ప్రీమియర్ షోలు వేద్దామని అనుకుంటే, 66 షోలు హౌస్ ఫుల్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. సినిమాను థియేటర్లలోనే చూసి ఆ అనుభూతిని పొందాలని కోరారు.తన మొదటి సినిమాకే ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు, చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి.

వారం రోజుల్లో మంచి వసూళ్లు సాధించింది. . ఈ సినిమా 7 రోజుల్లో నెట్ కలెక్షన్ దాదాపు రూ.12.70 కోట్లు (ఇండియా నెట్) సాధించింది. వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు రూ.16.5 కోట్లు. ఇందులో ఇండియా గ్రాస్ రూ.14 కోట్లు, ఓవర్సీస్ నుంచి రూ.2.5 కోట్లు వచ్చినట్లు సమాచారం.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.25 కోట్లు కాగా, ఇంకా రూ.8 కోట్లు వసూలు చేస్తే సేఫ్ జోన్‌లోకి వెళ్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ ప్రమోషన్ ఖర్చులతో కలిపి రూ.12 కోట్లు అయినట్లు సమాచారం.

Tags:    

Similar News