'Kochadaiiyaan' movie: 2.5 కోట్లు కట్టకుంటే జైలుకే.. రజినీ నిర్మాతకు హైకోర్టు ఆదేశాలు

రజినీ నిర్మాతకు హైకోర్టు ఆదేశాలు

Update: 2026-02-11 05:52 GMT

'Kochadaiiyaan' movie: చెక్ బౌన్స్ కేసులో 'కొచ్చడైయా న్' మూవీ (తెలుగులో 'విక్రమసింహ') ప్రొడ్యూసర్ మురళీ మనోహర్కు మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. బెంగళూరుకు చెందిన యాడ్ బ్యూరో సంస్థకు 4 వారాల్లో రూ.2.5 కోట్లు కట్టాల్సిందేనని ఆదేశించింది. లేదంటే ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 2014లో వచ్చిన 3డీ మోషన్ క్యాప్చ ర్ మూవీ 'కొచ్చడైయాన్'. భారీ అంచ నాలతో రూపొందిన ఈ చిత్రం నిర్మాణ సమయంలో మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ డైరెక్టర్ మురళీ మనోహర్ ఆర్థిక ఇబ్బందుల వల్ల యాడ్ బ్యూరో సంస్థ నుంచి రుణం తీసుకున్నారు. తిరిగి చెల్లించే క్రమంలో యాడ్ బ్యూరో ఎండీ అబిర్ చంద్ నహర్ కు రూ.5 కోట్ల చెక్కు ఇచ్చారు. అది బౌన్స్ కావడంతో ఆయన కోర్టుకె ళ్లారు. గతంలో ఈ కేసును విచారిం చిన ట్రయల్ కోర్టు మురళీ మనోహ ర్ను దోషిగా తేల్చి ఆరు నెలల జైలు శిక్ష విధించగా, ఆయన ఆ తీర్పును సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించా రు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇచ్చిన 4 వారాల్లోగా యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు రూ.2.5 కోట్లు కట్టకుంటే జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఆదేశించింది.

Tags:    

Similar News